సచివాలయం ఉద్యోగి అనిల్ కుమార్ మృతికి ఉద్యోగుల నివాళి

4చూసినవారు
సచివాలయం ఉద్యోగి అనిల్ కుమార్ మృతికి ఉద్యోగుల నివాళి
తాడిపత్రి మున్సిపల్ కమిషనర్ శివరామకృష్ణ వేధింపుల వల్లే సచివాలయ ఉద్యోగి అనిల్ కుమార్ మరణించారని సచివాలయ ఉద్యోగుల సంఘం నాయకులు ఆరోపించారు. బుధవారం అనంతపురం నగరపాలక సంస్థ ఆవరణలో అనిల్ కుమార్ కు నివాళులర్పించి, కొవ్వొత్తులు వెలిగించారు. ఇటీవల కాలంలో స్వర్ణ వార్డు ఉద్యోగులపై వేధింపులు తీవ్రమయ్యాయని నాయకులు సుధాకర్, లక్ష్మీనారాయణ, చిన్నూరప్ప, మల్లికార్జున పేర్కొన్నారు.

ట్యాగ్స్ :