పెద్దవడుగూరు మండలం మిడుతూరు గ్రామ సమీపంలో 44వ జాతీయ రహదారిపై ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. హైదరాబాద్ నుంచి బెంగళూరుకు బ్రీజర్ బాటిళ్ల లోడుతో వెళ్తున్న లారీలో అకస్మాత్తుగా మంటలు చెలరేగి భారీగా ఎగిసిపడ్డాయి. ఈ దుర్ఘటనలో లారీ డ్రైవర్ రషీద్ తీవ్రంగా గాయపడటంతో, అతన్ని వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.