తాడిపత్రి లో నలుగురి అరెస్ట్

8చూసినవారు
తాడిపత్రి లో నలుగురి అరెస్ట్
తాడిపత్రి మండలం గన్నేవారిపల్లె కాలనీలో ఇంటిలోకి చొరబడి దాడి చేసిన ఘటనలో నలుగురిని అరెస్టు చేసినట్లు తాడిపత్రి రూరల్ సీఐ శివగంగాధర్ రెడ్డి తెలిపారు. సోమవారం మధ్యాహ్నం ఆంజనేయులు, అజయ్, వేణు, రవీంద్రలు కలిసి సందీప్ అనే వ్యక్తితో ఉన్న గొడవల కారణంగా అతని ఇంటికి వెళ్లి, సందీప్ తో పాటు మరో ఇద్దరిపై కట్టెలు, రాళ్లతో దాడి చేసి గాయపరిచారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించినట్లు సీఐ పేర్కొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్