పెద్దవడుగూరు మండలంలో గడ్డివాముల దగ్ధం కలకలం రేపుతోంది. మల్లేనీపల్లిలో రైతు ఎస్. నాగార్జునకు చెందిన గడ్డివాము పూర్తిగా దగ్ధమైంది. ఇది ప్రమాదవశాత్తు జరిగిందా లేక ఉద్దేశపూర్వకంగా చేస్తున్నారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ ఆంజనేయులు తెలిపారు. ఈ ఘటనతో రైతులు ఆందోళన చెందుతున్నారు.