తాడిపత్రిలో ఐపీఎల్ బెట్టింగ్ కోసం తరలిస్తున్న రూ. 7 లక్షల నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. శివాలయం ప్రాంతంలో వాహనాల తనిఖీ చేస్తుండగా, ఒక వ్యక్తి పరారయ్యేందుకు ప్రయత్నించగా పోలీసులు అతడిని వెంబడించి అదుపులోకి తీసుకున్నారు. అతని వద్ద ఉన్న సంచిలో నగదును గుర్తించారు. విచారణలో ఐపీఎల్ బెట్టింగ్ కోసం ఈ డబ్బును తరలిస్తున్నట్లు సీఐ ఆరోహణ రావు తెలిపారు.