తాడిపత్రిలో జేసీ ప్రభాకర్ రెడ్డి పోలీస్ స్టేషన్ ఎదుట చేపట్టిన నిరసన దీక్షను విరమించారు. కేతిరెడ్డి పెద్దారెడ్డిపై పోలీసులు 196(1) BNS సెక్షన్ కింద కేసు నమోదు చేయడంతో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. 'మా సమస్యను ఎస్పీ కార్యాలయం వద్ద తేల్చుకుంటాం. టీడీపీకి సంబంధం లేకుండా కేవలం జేసీ కార్యకర్త అనే వాళ్లు మాత్రమే అక్కడికి సోమవారం రండి. తాడిపత్రిలో మేము ఉండాలా, లేదా అనేది ఎస్పీని అడుగుతాం' అని జేసీ ప్రభాకర్ రెడ్డి పేర్కొన్నారు.