అనంతపురం జాయింట్ కలెక్టర్ చరన్ బుధవారం పెద్దపప్పూరు మండలంలోని అశ్వత్థంలో శ్రీ అశ్వర్థ నారాయణస్వామి, శ్రీ చక్ర భీమలింగేశ్వర స్వామివార్ల దేవస్థానాన్ని సందర్శించారు. ఆలయ అర్చకులు బాలసుబ్రమణ్యం శర్మ, సుధీర్ శర్మలు వేదమంత్రోచ్ఛారణలతో స్వాగతం పలికి దర్శనం చేయించారు. అనంతరం ఆలయ చైర్మన్ శివ శంకర్ రెడ్డి తీర్థ ప్రసాదాలు అందజేసి శాలువాతో సత్కరించారు.