తాడిపత్రి మండలం గన్నేవారిపల్లెలో సుమారు 1024 మంది లబ్ధిదారులకు గృహ ప్రవేశాలు చేయించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఓ. ఆనంద్ ఐ.ఏ.ఎస్. పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యమంత్రి ఎన్టీఆర్ హౌసింగ్ టిడ్కో ద్వారా పెద్ద ఎత్తున గృహ ప్రవేశాలు జరుగుతున్నాయని, తాడిపత్రిలో పాల్గొనడం ఆనందంగా ఉందని కలెక్టర్ తెలిపారు. మిగిలిన ఇళ్లను త్వరితగతిన పూర్తి చేసి లబ్ధిదారులకు అందజేయాలని అధికారులను ఆదేశించారు.