తాడిపత్రిలోని రమేశ్ రెడ్డి కాలనీ వద్ద ఉన్న ఒక గుజరీ దుకాణంలో బుధవారం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ప్రమాదవశాత్తు చెలరేగిన మంటలు పెద్ద ఎత్తున ఎగిసిపడటంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. మంటలను అదుపు చేసేందుకు స్థానికులు ప్రయత్నించినప్పటికీ ఫలితం లేకపోయింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేసే పనిలో ఉన్నారు. ఈ ప్రమాదంలో ఆస్తి నష్టం వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.