తాడిపత్రి రూరల్ పరిధిలోని ఎల్లనూరు రోడ్డు రైల్వే గేట్ సమీపంలో మంగళవారం రాత్రి గాజుల రామకృష్ణ అనే వ్యక్తి రైలు కిందపడి మృతి చెందాడు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న జీఆర్పీ పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి, మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం తాడిపత్రి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతికి గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. మృతుడి బంధువుల ఫిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.