శనివారం సాయంత్రం యాడికి మండలం వేములపాడు క్రాస్ వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. కమలపాడుకు చెందిన జయరాజు బైక్‌పై తాడిపత్రికి వెళ్తుండగా, మార్గమధ్యంలో టిప్పర్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన జయరాజును మొదట తాడిపత్రి ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో మెరుగైన వైద్యం కోసం అనంతపురం తరలించినట్లు సమాచారం.