తాడిపత్రి శాసనసభ్యులు జెసి అష్మిత్ రెడ్డి తాడిపత్రి మండలంలోని గన్నెవారి పల్లి కాలనీలో పర్యటించి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రజలు తమ సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకురాగా, సంబంధిత అధికారులతో మాట్లాడి వెంటనే పరిష్కరించాలని ఆయన ఆదేశించారు. ఆధునిక మోటార్ల ఏర్పాటుతో నీటి సమస్య తీరడంతో ప్రజలు ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సచివాలయ ఉద్యోగులు, టిడిపి, జనసేన, బిజెపి కూటమి నాయకులు, కార్యకర్తలు, జెసి అనుచరులు, అభిమానులు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.