ప్రభుత్వ వైద్య కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ చేపట్టిన కోటి సంతకాల ప్రజా ఉద్యమం వేగంగా కొనసాగుతోంది. మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి పిలుపు మేరకు తాడిపత్రిలో ఆదివారం 22, 23వ వార్డుల పరిధిలో ఈ కార్యక్రమం నిర్వహించారు. కొసినేపల్లి నరసింహారెడ్డి సమన్వయంతో ప్రజల నుండి సంతకాలు సేకరించారు. ప్రైవేటీకరణ వల్ల పేద మరియు మధ్యతరగతి విద్యార్థులు వైద్య విద్యకు దూరమయ్యే ప్రమాదం ఉందని నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు.