తాడిపత్రి మండలం తేరన్నపల్లి గ్రామ సమీపంలో శుక్రవారం రాత్రి జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో అఖిల్ అనే యువకుడు మృతి చెందగా, నరసింహ, నాగేంద్ర, లక్ష్మీపతి అనే మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. తాడిపత్రికి చెందిన నలుగురు యువకులు రెండు బైకుల్లో తేరన్నపల్లికి వెళ్లి తిరిగి వస్తుండగా, గుర్తుతెలియని వాహనం ఢీకొనడంతో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.