పెద్దవడగూరు మండలం మిడుతూరు గ్రామ సమీపంలోని 44వ నంబరు హైవేపై మంగళవారం ఒక ప్రమాదం జరిగింది. స్థానికుల వివరాల ప్రకారం, ఒక ట్రాక్టర్ బైక్‌ను ఢీకొనడంతో గుత్తికి చెందిన నూర్ మొహమ్మద్ తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రుడిని చికిత్స కోసం గుత్తి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా, వైద్యులు మెరుగైన చికిత్స కోసం జిల్లా కేంద్రానికి రిఫర్ చేశారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.