మంగళవారం తాడిపత్రి మండలం శ్రీ ఆలూరుకోన రంగనాథ స్వామి దేవస్థానంలో ఎండోమెంట్ అధికారులు తలనీలాలు, టెంకాయ విక్రయాలపై బహిరంగవేలం పాట నిర్వహించారు. ఈ వేలం ద్వారా తలనీలాల అమ్మకం ద్వారా రూ. 9 లక్షలు, పార్కింగ్ ద్వారా రూ. 1,15,000, టెంకాయ, పూజ సామాగ్రి అమ్మకం ద్వారా రూ. 3,90,000, కళ్యాణమండపం అద్దె ద్వారా రూ. 2,70,000, హోటల్ నిర్వహణ ద్వారా రూ. 32,000 ఆదాయం వచ్చినట్లు అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో రామాంజనేయులు, చైర్మన్ ఓగేటి రంగనాయకులు పాల్గొన్నారు.