హెల్మెట్ లేకుండా ద్విచక్రవాహనదారులు వాహనం నడిపితే తొలిసారి జరిమానా విధిస్తామని, రెండోసారి పట్టుబడితే వాహనాన్ని సీజ్ చేస్తామని ఎస్ఐ నాగేంద్రప్రసాద్ హెచ్చరించారు. గురువారం ఆయన పెద్దపప్పూరు మండలంలోని చాగల్లు ప్రాజెక్టు సమీపంలోని కూడళ్లలో వాహనాల తనిఖీ చేపట్టారు. హెల్మెట్ లేని ద్విచక్ర వాహనదారులకు జరిమానా విధించారు.