పెద్దవడుగూరు: పెట్రోల్ బంక్ వద్ద తప్పిన పెను ప్రమాదం

1031చూసినవారు
పెద్దవడుగూరు: పెట్రోల్ బంక్ వద్ద తప్పిన పెను ప్రమాదం
పెద్దవడుగూరు మండలం కృష్ణపాడు సమీపంలోని 67వ జాతీయ రహదారి పక్కన గల భారత్ పెట్రోల్ బంక్ వద్ద సోమవారం పెను ప్రమాదం తప్పింది. అదుపుతప్పిన కారు పెట్రోల్ బంక్ దిమ్మెను బలంగా ఢీకొట్టింది. ప్రమాదం జరిగిన వెంటనే కారులో మంటలు వ్యాపించాయి. అక్కడి సిబ్బంది, డ్రైవర్ నాగరాజు అప్రమత్తమై మంటలను అరికట్టడంతో భారీ ప్రమాదం తప్పింది. ఈ ఘటన నుంచి కారు డ్రైవర్ సురక్షితంగా బయటపడ్డారు.

సంబంధిత పోస్ట్