సజ్జలదిన్నెలో పోలీసుల కార్డెన్ సెర్చ్

17చూసినవారు
సజ్జలదిన్నెలో పోలీసుల కార్డెన్ సెర్చ్
తాడిపత్రి మండలం సజ్జలదిన్నె గ్రామంలో శనివారం తెల్లవారుజామున పోలీసులు కార్డెన్ సెర్చ్‌ను నిర్వహించారు. జిల్లా ఎస్పీ జగదీశ్ ఆదేశాల మేరకు రూరల్ సీఐ శివగంగాధర్ రెడ్డి నేతృత్వంలో అనుమానితులు, రౌడీ షీటర్ల ఇళ్లను తనిఖీ చేశారు. గ్రామస్థులకు ఘర్షణలకు పాల్పడకుండా ప్రశాంతంగా జీవించాలని, సమస్యలుంటే చట్టపరంగా పరిష్కరించుకోవాలని సూచించారు. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్