తాడిపత్రిలో పోలీసుల దాడి.. 8 మంది పేకాట రాయుళ్లు అరెస్ట్

5939చూసినవారు
తాడిపత్రిలో పోలీసుల దాడి.. 8 మంది పేకాట రాయుళ్లు అరెస్ట్
తాడిపత్రి మండలంలోని పలు పేకాట స్థావరాలపై ఆదివారం పోలీసులు మెరుపు దాడులు నిర్వహించారు. చుక్కలూరు గ్రామంలోని గ్రానైట్ ఫ్యాక్టరీల వద్ద పేకాట ఆడుతున్నట్లు సమాచారం అందుకున్న సీఐ శివగంగాధర్ రెడ్డి, ఎస్సై ధరణిబాబు తన సిబ్బందితో కలిసి దాడి చేశారు. 8 మందిని అదుపులోకి తీసుకుని, రూ. 31, 000లు స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసినట్లు వివరించారు.

సంబంధిత పోస్ట్