తాడిపత్రి పట్టణంలో ద్విచక్ర వాహనం అదుపుతప్పి బోల్తా పడటంతో పులిప్రొద్దుటూరుకు చెందిన నారాయణస్వామికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు వెంటనే 108కు సమాచారం అందించి ఆసుపత్రికి తరలించారు. స్థానిక అంబులెన్స్ అందుబాటులో లేకపోవడంతో పుట్లూరు నుంచి వచ్చినట్లు తెలిసింది. పోలీసులు ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు.