వరదాయపల్లి గ్రామ సమీపంలో ద్విచక్ర వాహనం అదుపుతప్పి కింద పడడంతో చుక్కలూరు గ్రామానికి చెందిన బాలాజీ రత్నకుమార్ అనే వ్యక్తి మృతి చెందాడు. ఈ ఘటన గురువారం చోటు చేసుకుంది. అతన్ని తాడిపత్రి ప్రభుత్వ ఆసుపత్రి నుంచి బెంగళూరుకు తరలిస్తుండగా మార్గం మధ్యలో మృతి చెందాడు. ఘటనపై కేసు నమోదు చేసినట్లు సీఐ శివగంగాధర్ రెడ్డి తెలిపారు.