తాడిపత్రి: 12 కిలోమీటర్లు.. 45 నిమిషాలు

5చూసినవారు
తాడిపత్రి: 12 కిలోమీటర్లు.. 45 నిమిషాలు
తాడిపత్రి నుంచి బుగ్గ మీదుగా యాడికి, రాయలచెరువు, గుత్తికి వెళ్లే ప్రధాన రహదారి గత వైకాపా ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగా గుంతలు, కంకర తేలి దుస్థితికి చేరింది. బుగ్గ నుంచి యాడికి వరకు 12 కిలోమీటర్ల రహదారిపై ప్రయాణం నరకంగా మారింది. ఈ దూరాన్ని దాటడానికి 45 నిమిషాలకు పైగా సమయం పడుతోందని వాహనదారులు వాపోతున్నారు. యాడికి మండలంలోని కార్మికులు బుగ్గలోని సిమెంట్ పరిశ్రమకు నిత్యం ఈ రహదారి గుండానే ప్రయాణిస్తున్నారు.

సంబంధిత పోస్ట్