అనంతపురం జిల్లా యాడికి మండలం గుడిపాడు సమీపంలో సాగర్ సిమెంట్ వాహనాల ఆదాయం విషయంలో టీడీపీలోని రెండు వర్గాల మధ్య శుక్రవారం రాత్రి ఘర్షణ చోటుచేసుకుంది. ఈ ఘర్షణలో పరస్పరం దాడులు చేసుకోవడంతో కొన్ని ద్విచక్ర వాహనాలు ధ్వంసమయ్యాయి. సిమెంట్ ఫ్యాక్టరీ కార్యాలయం అద్దాలు కూడా పగిలిపోయాయి. ఈ దాడుల్లో ఇరువర్గాలకు చెందిన పలువురు గాయపడ్డారు. పోలీసులు ఈ ఘటనపై దర్యాప్తు ప్రారంభించారు.