పుట్లూరు మండలం కడవకల్లులో ఉపాధి హామీ పథకం కింద రూ. 5 లక్షలతో మంజూరైన సీసీ రోడ్డు పనుల్లో అక్రమాలు వెలుగుచూశాయి. ఈ రోడ్డు నిర్మాణానికి అవసరమైన 67 క్యూబిక్ మీటర్ల ఇసుక తరలింపునకు రెవెన్యూ అధికారుల అనుమతి తీసుకోకుండానే పుట్లూరు ఇంజినీర్ అనధికారిక ఉత్తర్వులు జారీ చేయడం వివాదాస్పదమైంది. దీనితో ఆరవేడు నుంచి 24 ట్రాక్టర్ల ద్వారా ఇసుకను తరలిస్తున్నట్లు సమాచారం.