ఎల్లనూరులోని సాయిబాబా గుడి సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో నరేశ్ కుమార్ అనే యువకుడికి తీవ్ర గాయాలయ్యాయి. జంగంపల్లిలో జరుగుతున్న 'రణబలి' సినిమా షూటింగ్ చూసి బైక్‌పై తిరిగి వస్తున్న అతడిని, ఎదురుగా వస్తున్న స్కార్పియో వాహనం బలంగా ఢీకొంది. ఈ ఘటనలో గాయపడిన నరేశ్ కుమార్‌ను చికిత్స నిమిత్తం తాడిపత్రి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.