
తృటిలో తప్పిన పెను ప్రమాదం
ఉరవకొండలో డిగ్రీ కళాశాల వైపు వెళ్తున్న ప్రసాద్ కారును అనంతపురం నుంచి బళ్లారికి వెళ్తున్న ఐచర్ వాహనం ఢీకొట్టడంతో తృటిలో పెను ప్రమాదం తప్పింది. ఈ ఘటనలో కారు ముందుభాగం దెబ్బతిన్నప్పటికీ, కారులో ఉన్న ముగ్గురు వ్యక్తులు సురక్షితంగా బయటపడ్డారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని, కేసు నమోదు చేసుకుని, వాహనాలను పోలీస్ స్టేషన్కు తరలించి దర్యాప్తు చేస్తున్నారు.







































