విడపనకల్లు మండలంలో పిడుగుపాటుకు గొర్రెల కాపరి మల్లికార్జునకు చెందిన 22 గొర్రెలు, మేకలు అక్కడికక్కడే మృతి చెందాయి. ఈ ఘటనలో మల్లికార్జున అస్వస్థతకు గురవ్వడంతో చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. చిరుజల్లులు కురిసిన సమయంలో పిడుగు పడిందని స్థానికులు తెలిపారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.