పిడుగుపాటుకు పాడి ఎనుము మృతి

948చూసినవారు
పిడుగుపాటుకు పాడి ఎనుము మృతి
యాడికి మండలంలో శుక్రవారం ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. ఈ క్రమంలో పిడుగుపాటుకు గుడిపాడ గ్రామానికి చెందిన రైతు తలారి తిరుమలయ్యకు చెందిన పాడి ఎనుము మృతి చెందింది. రైతు తన ఎనుమును ఇంటి ముందున్న చెట్టు కింద కట్టేయగా, పిడుగు చెట్టుపై పడి ఎనుము అక్కడికక్కడే మరణించింది.

సంబంధిత పోస్ట్