అనంతపురం జిల్లాలోని ఉరవకొండలో నూతనంగా నిర్మిస్తున్న అన్నా క్యాంటీన్ నిర్మాణం వేగంగా జరుగుతోంది. జనవరి నెల తర్వాత ప్రారంభం కానున్న ఈ క్యాంటీన్ ద్వారా పేదలు, మధ్య తరగతి ప్రజలు, కూలీలు, వృద్ధులకు కేవలం 5 రూపాయలకు భోజనం, అల్పాహారం అందించనున్నారు. ఈ క్యాంటీన్ ఎప్పుడు ప్రారంభమవుతుందో చూడాలి.