శుక్రవారం రాత్రి ఉరవకొండ పట్టణంలోని 7వ వార్డు తలారి (బోయ) వీధిలో పాత కక్షల నేపథ్యంలో రెండు వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. కట్టెలతో పరస్పరం దాడులు చేసుకోవడంతో సుమారు 10 మంది గాయపడ్డారు. క్షతగాత్రులకు ఉరవకొండ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. పోలీసులు ఆసుపత్రికి చేరుకుని వివరాలు సేకరించి, దర్యాప్తు చేపట్టారు.