సోమవారం ఉరవకొండ మండలంలోని బూదిగవి గ్రామంలో ఆర్. ఎం. ఎస్. ఏ కింద 43.75 లక్షల రూపాయల అంచనాతో నిర్మించిన జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన బూదిగవి గ్రామ ప్రాథమిక పాఠశాలను కూడా తనిఖీ చేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలో ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమం రెండింటినీ సమతూకంలో ముందుకు తీసుకుపోవడానికి కృషి చేస్తోందని మంత్రి పేర్కొన్నారు.