గుత్తి జడ్పీ ఉన్నత పాఠశాల లో కాలం చెల్లిన ఫుడ్ ప్యాకెట్లు

908చూసినవారు
గుత్తి జడ్పీ ఉన్నత పాఠశాలను రాష్ట్ర ఫుడ్ కమిషన్ సభ్యురాలు గంజిమాల దేవి శుక్రవారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా స్టోర్ రూమ్ లో గడువు ముగిసిన రాగి పిండి ప్యాకెట్లను గుర్తించారు. పాఠశాల హెచ్ఎం సుంకన్నను ప్రశ్నించగా, పొరపాటు జరిగిందని, వాటిని ఉపయోగించడం లేదని ఆయన బదులిచ్చారు. వెంటనే ఆ ప్యాకెట్లను బయట పారవేయాలని గంజిమాల దేవి ఆదేశించారు.

సంబంధిత పోస్ట్