ట్రాక్టర్ కిందపడి వ్యవసాయ మహిళ మృతి

4చూసినవారు
ట్రాక్టర్ కిందపడి వ్యవసాయ మహిళ మృతి
కూడేరు మండలం ఇప్పేరులో ట్రాక్టర్ కిందపడి వ్యవసాయ కూలీ శివలింగమ్మ ప్రాణాలు కోల్పోయారు. తోటి కూలీలతో కలిసి పొలంలో పనికి వెళ్లిన శివలింగమ్మ, మధ్యాహ్నం భోజనం చేస్తుండగా ప్రమాదం జరిగింది. ట్రాక్టర్ ట్రాలీ కింద కూర్చున్న ఆమెపైకి, ఒక పాప అకస్మాత్తుగా ట్రాక్టర్ ఎక్కి తాళాలు తిప్పడంతో ట్రాక్టర్ ముందుకు కదిలింది. దీంతో శివలింగమ్మపైకి ట్రాక్టర్ ఎక్కింది. వెంటనే అనంతపురం ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ ఆమె మృతి చెందింది.

ట్యాగ్స్ :