ఎన్టీఆర్ భరోసా పథకం పెన్షన్లను పంపిణీ చేసిన ఆర్థికశాఖ మంత్రి

8చూసినవారు
ఎన్టీఆర్ భరోసా పథకం పెన్షన్లను పంపిణీ చేసిన ఆర్థికశాఖ మంత్రి
ఉరవకొండ మండలంలోని బూదిగవి గ్రామంలో సోమవారం, రాష్ట్ర ఆర్థిక ప్రణాళిక, వాణిజ్య పన్నులు మరియు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ ఎన్టీఆర్ భరోసా పథకం కింద లబ్ధిదారుల ఇంటి వద్దకే వెళ్లి పెన్షన్లను స్వయంగా పంపిణీ చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అర్హులైన ప్రతి లబ్ధిదారునికి పింఛన్లు పంపిణీ చేస్తున్నామని మంత్రి తెలిపారు.

సంబంధిత పోస్ట్