అనంతపురంలో గంటపాటు కురిసిన భారీ వర్షం, ఈదురుగాలులతో జనజీవనాన్ని స్తంభింపజేసింది. నగరంలో పలుచోట్ల పెద్దపెద్ద చెట్లు వేర్లతో సహా విరిగిపడి ఇళ్లపై, రోడ్లపై పడ్డాయి. ఈ సంఘటనలు ప్రజలను భయాందోళనకు గురిచేశాయి. వర్షం కారణంగా నగరంలో అనేక ప్రాంతాల్లో జనజీవనం అస్తవ్యస్తంగా మారింది.