వెంకటాంపల్లిలోని జడ్పీ ఉన్నత పాఠశాల బయాలజీ ఉపాధ్యాయుడు సుధాకర్ తన వికృత చేష్టలతో విద్యార్థినులను వేధింపులకు గురిచేస్తున్నట్లు వచ్చిన ఫిర్యాదులపై విచారణ జరిపి, రుజువు కావడంతో ఉన్నతాధికారులు అతన్ని సస్పెండ్ చేశారు. ఈ విషయాన్ని డీఈవో ప్రసాద్బాబు తెలిపారు. ఈ సంఘటన వజ్రకరూరు మండలంలో జరిగింది.