చంద్రగ్రహణం ఎఫెక్ట్... పెన్నహోబిలం ఆలయం మూసివేత

10చూసినవారు
ఉరవకొండ మండలంలోని పెన్నహోబిలం శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయాన్ని చంద్రగ్రహణం సందర్భంగా తాత్కాలికంగా మూసివేశారు. గ్రహణం ప్రారంభానికి ముందే ఆలయ ద్వారాలను మూసివేసిన అర్చకులు, అధికారులు సంప్రదాయ ఆచారాలను పాటించారు. గ్రహణం ముగిసిన తర్వాత శుద్ధి కార్యక్రమాలు, ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తులకు దర్శనం కల్పించనున్నట్లు ఆలయ వర్గాలు తెలిపాయి. భక్తులు సహకరించాలని కోరారు.

సంబంధిత పోస్ట్