అనంతపురం జిల్లాలోని పేద, మధ్యతరగతి వర్గాలకు ఆశాదీపంగా నిలుస్తున్న ఆర్డీటీ సంస్థను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని ఉరవకొండ మాజీ ఎమ్మెల్యే వై. విశ్వేశ్వర్ రెడ్డి పేర్కొన్నారు. ఈ నెల 9వ తేదీన ఉరవకొండ తహశీల్దార్ కార్యాలయం నుంచి నిర్వహించనున్న భారీ ధర్నాను జయప్రదం చేయాలని ఆయన పిలుపునిచ్చారు.