
పదేళ్లుగా సైలెంట్.. మళ్లీ ప్రత్యక్ష రాజకీయాల్లో మాజీ ఎమ్మెల్యే కుటుంబం
ఏపీ రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. పదేళ్లుగా సైలెంటుగా ఉన్న ఓ మాజీ ఎమ్మెల్యే ఇప్పుడు మళ్లీ రాజకీయాల్లో వచ్చేందుకు సిద్ధమయ్యారు. ఆయన ఎవరో కాదు అనంతరంపురం అర్బన్ మాజీ ఎమ్మెల్యే గుర్నాథ్ రెడ్డి. ఈ మేరకు ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కొత్త సంవత్సరం సందర్భంగా తాను, తన కుటుంబం మళ్లీ ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తున్నట్లు ప్రకటించారు. గతంలో ఆయన వైఎస్సార్ హయాంలో కాంగ్రెస్ పార్టీలో, ఆ తర్వాత జగన్‌తో కలిసి పని చేశారు. గత పదేళ్ల నుంచి రాజకీయాలకు దూరంగా ఉన్న ఆయన ఈసారి ఏ పార్టీ నుంచి బరిలోకి దిగుతారన్నది ఆసక్తికరంగా మారింది.




