రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి పయ్యావుల కేశవ్ ఈరోజు ఉరవకొండలో నూతనంగా నిర్మించిన అన్న క్యాంటీన్ భవనాన్ని పరిశీలించారు. పేద ప్రజలకు కేవలం 5 రూపాయలకే భోజనం అందించే లక్ష్యంతో, ఉరవకొండ ప్రభుత్వ ఆసుపత్రి ఎదురుగా నిర్మించిన ఈ క్యాంటీన్‌ను త్వరలోనే ప్రారంభిస్తామని ఆయన తెలిపారు. తక్కువ ధరలో నాణ్యమైన భోజనం అందించే ఈ క్యాంటీన్ ప్రజలకు ఎంతో ఉపయోగపడుతుందని మంత్రి పేర్కొన్నారు.