ఉరవకొండ నియోజకవర్గ అభివృద్ధికి రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ ప్రత్యేక చర్యలు చేపట్టారు. గత ప్రభుత్వంలో అసంపూర్తిగా మిగిలిపోయిన 40 సచివాలయాల నిర్మాణానికి రూ. 9.61 కోట్లు, 32 రైతు సేవా కేంద్రాల నిర్మాణానికి రూ. 6.33 కోట్లు మంజూరు చేయించారు. తాజాగా, 57 అంగన్వాడీ కేంద్రాల భవన నిర్మాణాల కోసం రూ. 5.39 కోట్లు మంజూరు చేస్తూ ప్రభుత్వం గురువారం ప్రత్యేక జీవో విడుదల చేసింది. ఈ నిధులతో నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులు వేగవంతం కానున్నాయి.