పీఏబీఆర్ గేట్లు బంద్ - కొనసాగుతున్న జల విద్యుత్ ఉత్పత్తి

7చూసినవారు
పీఏబీఆర్ గేట్లు బంద్ - కొనసాగుతున్న జల విద్యుత్ ఉత్పత్తి
కూడేరు మండలం పెన్నహోబిలం బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ (పీఏబీఆర్) ప్రధాన గేటును శనివారం మూసివేశారు. ఐదు రోజుల పాటు గేట్లు తెరిచి మిడ్ పెన్నార్‌కు నీటిని విడుదల చేశారు. ప్రస్తుతం డ్యాంలోని జల విద్యుత్ కేంద్రంలో ఒక టర్బైన్‌తో 885 క్యూసెక్కుల నీటిని వినియోగిస్తూ దాదాపు 75వేల యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నారు. నీటి నిల్వ 5.214 టీఎంసీలకు చేరిందని ఇరిగేషన్ ఏఈఈ లక్ష్మీదేవి తెలిపారు. హంద్రీనీవా నుంచి 60 క్యూసెక్కుల నీరు మాత్రమే ఇన్‌ఫ్లోగా వస్తుండగా, 1000 క్యూసెక్కుల నీటిని బయటకు వదులుతున్నట్లు ఆమె పేర్కొన్నారు.

ట్యాగ్స్ :