
దేశవ్యాప్తంగా 100 నగరాలకు విస్తరించిన అమెజాన్ నౌ
దేశవ్యాప్తంగా 100 నగరాలకు అమెజాన్ నౌ క్విక్ డెలివరీ సేవలను విస్తరించనున్నట్లు అమెజాన్ ప్రకటించింది. గతంలో ఢిల్లీ ఎన్సీఆర్, ముంబై, బెంగళూరు నగరాల్లో మాత్రమే అందుబాటులో ఉన్న ఈ సేవలు ఇప్పుడు పుణె, హైదరాబాద్, చెన్నై, కోల్ కతా వంటి ప్రధాన నగరాలకు విస్తరించాయి. ఈ విస్తరణ కోసం సంస్థ సుమారు రూ.2,800 కోట్ల పెట్టుబడి పెడుతోంది. ఈ విస్తరణ వల్ల సుమారు 16 వేల మంది రైతులు లాభపడతారని అమెజాన్ తెలిపింది.




