ఉరవకొండ పట్టణంలోని అంబేడ్కర్ నగర్ కాలనీలో ఆదివారం అర్ధరాత్రి రెండు వర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. రోడ్డుపై ఒకరిపై ఒకరు పిడిగుద్దులతో దాడులకు దిగడంతో ఆ ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దాదాపు గంటపాటు ఉద్రిక్త వాతావరణం కొనసాగింది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే అక్కడికి చేరుకుని ఇరువర్గాల వారిని చెదరగొట్టారు. ఈ సంఘటనతో ఆ ప్రాంతంలో తీవ్ర కలకలం రేగింది.