బెళుగుప్ప మండలంలో రైతులు తమ పంటలను అమ్ముకోవడానికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వ్యాపారులు, దళారులు కుమ్మక్కై మొక్కజొన్న, పప్పుశనగ, కంది పంటలను రివాజు పేరుతో దోచుకుంటున్నారు. గతంలో క్వింటాలుకు కిలో మాత్రమే అదనంగా తీసుకునేవారు, కానీ ఇప్పుడు 50 కిలోల బస్తాకు 52 కిలోల 300 గ్రాముల తూకం వేస్తూ రైతులను మోసం చేస్తున్నారని శనివారం రైతులు ఆరోపించారు. రైతుల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని దళారులు ఆదాయం ఆర్జిస్తున్నారని తెలిపారు.