ఉరవకొండ పట్టణ పరిధిలోని కనేకల్లు క్రాస్ నుంచి గుంతకల్లు రోడ్డు వరకు జరుగుతున్న బైపాస్ రోడ్డు పనులను రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ మంగళవారం పరిశీలించారు. ఈ పనులను వేగంగా, త్వరితగతిన చేపట్టాలని అధికారులను ఆదేశించారు. 3 కిలోమీటర్ల మేర చేపడుతున్న ఈ బైపాస్ రోడ్డు పనులు ఇప్పటికే సగానికిపైగా పూర్తయ్యాయని అధికారులు వివరించారు.