ఉరవకొండ: రోడ్డు ప్రమాదంలో చోళసముద్రం రైతు మృతి

9చూసినవారు
ఉరవకొండ: రోడ్డు ప్రమాదంలో చోళసముద్రం రైతు మృతి
ఆదివారం, కూడేరు మండలం చోళసముద్రం గ్రామానికి చెందిన రైతు పర్వతయ్య, రెండున్నర ఎకరాల పొలంలో వేరుశనగ సాగు కోసం ఆమిద్యాల గ్రామంలో విత్తనాలు కొనుగోలు చేశాడు. విత్తనాలను ఆటోలో ఇంటికి తరలిస్తుండగా, కొర్రకోడు గ్రామం సమీపంలో ఎదురుగా వచ్చిన ద్విచక్ర వాహనం ఢీకొనడంతో పర్వతయ్య తీవ్రంగా గాయపడ్డాడు. అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్