బెళుగుప్ప స్థానిక ఉన్నత పాఠశాలలో శనివారం డీవైఈవో పాటిల్ మల్లారెడ్డి పదవీ విరమణ ఆత్మీయ సన్మానసభ జరిగింది. ఈ సందర్భంగా పలువురు వక్తలు మల్లారెడ్డి విద్యాభివృద్ధికి చేసిన సేవలను కొనియాడారు. ఉద్యోగ ధర్మాన్ని బాధ్యతగా నిర్వహిస్తూ, నైతిక విలువలు, నిబద్ధతతో విద్యాభివృద్ధికి ఎనలేని కృషి చేసి ఆదర్శంగా నిలిచారని డీఈవో ప్రసాద్ బాబు, సమగ్ర శిక్ష అభియాన్ అడిషనల్ ప్రాజెక్టు కోఆర్డినేటర్ శైలజ పేర్కొన్నారు.