ఉరవకొండ పట్టణ సమీపంలోని పాల్తూరు ఆర్చ్ వద్ద శుక్రవారం రాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. అనంతపురం నుంచి ఉంతకల్లుకు వెళ్తుండగా ఆటో బోల్తా పడి నలుగురు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. అటుగా వెళుతున్న కొందరు గమనించి వెంటనే 108 వాహనానికి సమాచారం అందించారు. వారు క్షతగాత్రులను ఉరవకొండ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.